
D Educt: Nov 18: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్‌ను జనవరి 24న నిర్వహించనుంది. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 166 పోస్టులను భర్తీ చేయనుంది. సివిల్ సర్వీసెస్‌లో డిప్యూటీ కలెక్టర్లు, పోలీస్ సర్వీసెస్‌లో డీఎస్పీలు, ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌లో డీఈఓలు, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్, స్టేట్ ఆడిట్ సర్వీస్‌తో పాటు మొత్తం 13 ఏపీ సర్వీసుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
గ్రూప్-1 పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. మొత్తం 825 మార్కులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ మూడు దశల్లో ప్రతిభ కనబరిస్తేనే తుది ఎంపికకు అర్హత సాధిస్తారు.
గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్లోని పేపర్-2 (ఆబ్జెక్టివ్ టైప్)లో జనరల్ ఆప్టిట్యూడ్ విభాగానికి 120 మార్కులు కేటాయించారు. ఇందులో జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున పరీక్ష నిర్వహిస్తారు.
అభ్యర్థులు జనరల్ ఆప్టిట్యూడ్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. ఈ కింద అందించిన జనరల్ ఆప్టిట్యూడ్ స్టడీ మెటీరియల్‌ను అనుసరిస్తూ పరీక్షకు సిద్ధం కావచ్చు.
