Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

Date:

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం పరిసరాలను 13 ప్రధాన జోన్లు, 89 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్‌లో 80 నుంచి 100 మంది పోలీసులను మోహరించారు.

మొత్తం భద్రతా ఏర్పాట్లను 30 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ, ఏడీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు బందోబస్తు నిర్వహణను సమన్వయం చేస్తున్నారు. సభా ప్రాంగణం, విమానాశ్రయ పరిసరాలు, వీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయి.

ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం భోగాపురానికి చేరుకోనున్నారు. మంగళగిరి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం మిరాకిల్ సిటీ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో బస చేయనున్నారు. శనివారం ఉదయం గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రధానమంత్రి మోడీకి స్వాగతం పలికి, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా శుక్రవారం సాయంత్రం విశాఖపట్నానికి చేరుకోనున్నారు. సీఎం అధికారిక సమావేశాల్లో పాల్గొనగా, మంత్రి లోకేష్ నేరుగా భోగాపురానికి వెళ్తారు. శనివారం జరిగే ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి మోడీతో కలిసి ఇద్దరూ పాల్గొంటారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీ ఇండియన్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్

https://www.youtube.com/shorts/aUiZDGh1IJY?feature=share D-News: ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక...

Headache Causes: రోజూ తలనొప్పి వస్తుందా? ఈ చిన్న కారణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే కొందరిని మాత్రం తరచూ, కొన్ని...

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ

https://youtu.be/7sVrEcCAR5Q తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌...

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...