విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 6 నుంచి 19 వరకు స్కూళ్లకు సెలవులిచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం!

Date:

సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం ఇటీవల దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరచుకున్నాయి. కొత్త పుస్తకాలు, బ్యాగులు, యూనీఫాంలతో విద్యార్ధులు ఎంతో హుషారుగా బడులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మరోమారు బడులకు వరుస సెలవులు రానున్నాయి. ఏకంగా రెండు వారాల పాటు సెలవులు రానున్నాయి.

వానాకాలం వచ్చినా బాణుడు ఇంకా భగభగలాడుతూనే ఉన్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జూలై 6 నుంచి జూలై 19 వరకు రెండు వారాల పాటు వేసవి సెలవులను రానున్నాయి. ఈ మేరకు కాశ్మీర్ లోయ వ్యాప్తంగా ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు ఉన్న విద్యా సంస్థలకు ఇస్తున్నట్లు అక్కడి కాశ్మీర్ విద్యా డైరెక్టరేట్ (DSEK) ప్రకటించింది.

వేసవి సెలవుల అనంతరం మళ్లీ జూలై 20న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అదే రోజు నుంచి యధావిధి తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా కాశ్మీర్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పరిమితికి మించి పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులు, విద్యార్థులు వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ మంత్రి సకీనా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సెలవుల సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది సురక్షితంగా ఉండాలని కోరారు. విద్యార్థులు తగినన్ని నీళ్లు తాగాలని, ఎండ వేడిమి నుండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ సమయాన్ని విశ్రాంతి, చదువు, కుటుంబంతో జరుపుకునే కార్యక్రమాల కోసం ఉపయోగించుకోవాలని ఆమె ప్రోత్సహించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...