తెలంగాణలో కొత్త పెన్షన్లపై బిగ్ అప్‌డేట్.. ఆగస్టు 15 నుంచి పింఛన్లు.. వారికి పెన్షన్లు కట్

Date:

కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ చెప్పింది. ఆగస్ట్ 15 నుంచి కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు వెల్లడించారు. ఇక పింఛన్ లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పెన్షన్ల జాబితా నుంచి అనర్హుల పేర్లను ఏరివేసి.. అర్హులకే అందించేలా చర్యలు చేపడుతున్నారు.

తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులు సహా కొత్త లబ్ధిదారులకు ఆగస్ట్ 15వ తేదీ నుంచి పింఛన్లు అందజేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు.

ములుగు జిల్లా పర్యటన సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క.. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన, కుటుంబ ఆధారం లేక ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని భావిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...