లోక్‌సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!

Date:

అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్‌సభ ముందుకు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఒక అధికార పక్షం ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్షం సంపూర్ణ మద్దతు పలకడం విశేషం.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌ విభజన సందర్భంగా ఏపీకి అనేక హామీలు ఇచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ గుర్తు చేశారు. అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారం ఎక్కడ ? అని ఆయన ప్రశ్నించారు. పన్ను రాయితీలు, పరిశ్రమలకు రాయితీలు ఇస్తామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది, ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్దికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్న మాణిక్యం ఠాగూర్, అమరావతితోపాటు తిరుపతి,విజయవాడ, వైజాగ్ నగరాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు.

అమరావతి బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. రాష్ట్ర రాజధాని నిర్ణయమన్నది రాష్ట్రం ఇష్టమన్న ఎంపీ మిథున్‌ రెడ్డి, గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్ ఇచ్చిందన్నారు. అమరావతిపై కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 5 వేల కోట్లే ఖర్చు చేసిందన్నారు. ఇప్పటివరకు అమరావతి రైతులకు ప్రభుత్వం ఫ్లాట్లు ఇవ్వలేదన్నారు. వైసీపీ అమరావతికి వ్యతిరేకం కాదన్న ఎంపీ మిథున్ రెడ్డి, ఈ బిల్లు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కానీ ఈ తరహాలో బిల్లు సరికాదని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అమరావతి బిల్లును నిరసిస్తూ లోక్‌సభ నుంచి వైసీపీ వాకౌట్ చేస్తున్నట్లు మిథున్ రెడ్డి ప్రకటించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...