సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి, ప్లస్ టూ పరీక్షల తేదీలను శుక్రవారం ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 16 నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీతో ముగియనున్నాయి.

ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షల తేదీలను కూడా బోర్డు వెల్లడించింది. తాజాగా థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో విద్యార్థులు తమ పరీక్షల సన్నద్ధతను మరింత ప్రణాళికాబద్ధంగా కొనసాగించేందుకు అవకాశం ఏర్పడింది.

ఈసారి దేశవ్యాప్తంగా, విదేశాల్లో ఉన్న సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలకు చెందిన 46 లక్షల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి, ప్లస్ టూ పరీక్షలకు హాజరుకానున్నట్లు బోర్డు పరీక్షల నియంత్రణాధికారి వెల్లడించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాయనున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి, 12వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను నవంబర్ 6న శుక్రవారం విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 9 వరకు జరగనుండగా, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16న ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఇప్పటికే 10వ, 12వ తరగతి విద్యార్థులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు, అంతర్గత మూల్యాంకన తేదీలను కూడా బోర్డు ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా, విదేశాల్లో ఉన్న సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 2027 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 13 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

అయితే శీతాకాలంలో పాఠశాలలు నిర్వహించే ప్రాంతాల్లోని విద్యార్థులకు మాత్రం ప్రాక్టికల్ పరీక్షలు ముందుగానే జరగనున్నాయి. ఆయా పాఠశాలల్లో 2026 నవంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు ప్రాక్టికల్స్, అంతర్గత మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో విద్యార్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్‌ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించేందుకు అవకాశం ఏర్పడింది.

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం కంట్రోలర్ సన్యం భరద్వాజ్ వెల్లడించారు. అదేవిధంగా ప్లస్ టూ పరీక్షలు కూడా ఫిబ్రవరి 16న ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు.

పదో తరగతిలో మొత్తం 83 సబ్జెక్టులకు, ప్లస్ టూలో 121 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షల షెడ్యూల్‌ను 101 రోజుల ముందుగానే విడుదల చేసినట్లు వెల్లడించారు. దీనివల్ల విద్యార్థులకు పరీక్షల సన్నద్ధత కోసం తగినంత సమయం లభిస్తుందని చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షల కోసం 26.5 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, ప్లస్ టూ పరీక్షలకు 19.8 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు సన్యం భరద్వాజ్ వెల్లడించారు. మొత్తంగా రెండు తరగతుల్లో కలిపి 46 లక్షల మందికి పైగా విద్యార్థులు సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు.