రేపు చంద్రబాబు పరిస్థితి కూడా అంతే: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Date:

దేశంలో BJPతో పొత్తుపెట్టుకున్న పార్టీల మనగడ ప్రశ్నార్థకమే.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఎక్‌నాథ్ షిండే పరిస్థితి చూస్తూనే ఉన్నామని. రేపు టీడీడీ, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందంటూ పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ చేస్తూ.

పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీకి సీట్లు తక్కువగా ఉన్నాయని, అందుకే టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారని. భవిష్యత్‌లో BJP బలం పెరిగితే TDPని పక్కనపెడతారని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. లోక్‌సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికి మాత్రమే .. వాటిని ఇంప్లిమెంట్ చేసేది స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు అధికార యంత్రాంగం. 2/3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్నింటిని చట్టాలు చేయలేమన్నారు.

కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు తనకు రాజుగా 2/ 3 మెజార్టీతో చట్టం చేసుకుంటే ఒప్పుకోరు కదా అన్నారు. డిక్టేటర్‌షిప్‌ని ఎవరు ఒప్పుకోరు. ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ కి కేవలం 11 సీట్లే ఉన్నాయి.. అలా అని ఆంధ్రప్రదేశ్ కు నేను రాజు అని చంద్రబాబు నాయుడు చట్టం తీసుకొస్తే ఒప్పుకుంటారా.? అని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే మోదీ కుట్రను ప్రజలంతా కలిసి ఓడించారన్నారు. డీలిమిటేషన్ బిల్లును పక్కనపెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును మళ్లీ సోమవారం సభలో పెట్టాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో వేరే వేరే ముసుగు తొడుక్కుని వస్తే తాము కచ్చితంగా గుర్తిస్తామన్నారు సీఎం రేవంత్.

సీట్ల పెంపులో మోదీ ఎన్నుకున్న విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కిషన్ రెడ్డి తనను విమర్శించడం మాని దక్షిణాదికి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం ఏంటో సూచించాలన్నారు సీఎం రేవంత్. మోదీ సంతోషం కోసమే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పని చేస్తున్నారన్నారు. తేజస్వి వ్యాఖ్యలను సీఎం రేవంత్ తప్పుబట్టారు. తెలంగాణపై మోదీ తరహాలోనే తేజస్వి కూడా మాట్లాడారన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...