Nara Lokesh: చంద్రబాబు సంచలన నిర్ణయం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్

Date:

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించారు. టీడీపీ నేషనల్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ని కొనసాగించారు. మొత్తం 29 మందితో పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేయగా. 31 మందితో జాతీయ కమిటీని నియమించారు. అలాగే 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు.

జాతీయ కార్యదర్శులుగా ముగ్గురికి, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం ఇచ్చింది టీడీపీ. నారా లోకేష్‌కు ప్రమోషన్ కల్పిస్తారని, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయనను ప్రకటిస్తారనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. గత ఏడాది జరిగిన మహానాడులో దీనిపై నిర్ణయం తీసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు దానిపై నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేశ్ కిలార్‌లను నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురిని, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని, జాతీయ అధికారి ప్రతినిధులుగా 10 మందికి బాధ్యతలు అప్పగించారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు 7, ఉపాధ్యక్షులు 16, అధికార ప్రతినిధులు 14, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లు 10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు 59, రాష్ట్ర కార్యదర్శులు 77 మందిని ప్రకటించారు.

ఇక రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలు ఉండగా.. జాతీయ కమిటీలు, పొలిట్ బ్యూరోలో కూడా మహిళలకు అవకాశం కల్పించారు. సామాజిక, ప్రాంతీయ అంశాలను పరిగణలోకి తీసుకుని పదవులు అప్పగించారు. కష్టపడే తత్వం, పార్టీకి కట్టుబడి ఉండటం లాంటివి పరిగణలోకి తీసుకుని పార్టీ పదవులు అప్పగించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...