పుదుచ్చేరిలో చట్టం ముందు అందరూ సమానమేనని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అధికార ఎన్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముత్యాల్‌పేట ఎమ్మెల్యే వయ్యాపురి మణికందన్ హెల్మెట్ లేకుండా, నంబర్ ప్లేట్ కూడా లేని ద్విచక్ర వాహనంపై అసెంబ్లీకి వెళ్తుండగా తూర్పు విభాగం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటాచలపతి గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేకు రూ.1,500 జరిమానా విధించారు.

అయితే, తనకు ప్రభుత్వం కార్లు కేటాయించినప్పటికీ డ్రైవర్లను నియమించకపోవడంతోనే బైక్‌పై అసెంబ్లీకి వెళ్లాల్సి వచ్చిందని ఎమ్మెల్యే మణికందన్ వివరణ ఇచ్చారు. ఈ ఘటన పుదుచ్చేరిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సాధారణ ప్రజలపైనే పోలీసులు చర్యలు తీసుకుంటారని చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు వంటి ప్రముఖులు హెల్మెట్ లేకుండా ప్రయాణించినా, సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా లేదా నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపినా పోలీసులు పట్టించుకోరనే అభిప్రాయం ఉంది. అయితే పుదుచ్చేరిలో జరిగిన ఓ ఘటన ఈ భావన తప్పని నిరూపించింది.

పుదుచ్చేరిలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే నంబర్ ప్లేట్ లేని స్కూటర్‌పై, హెల్మెట్ కూడా ధరించకుండా అసెంబ్లీకి బయలుదేరారు. అయితే ఆయన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని గుర్తించిన పోలీసులు ఎలాంటి పక్షపాతం చూపించలేదు. ఎమ్మెల్యే అనే హోదాను పక్కనపెట్టి, నిబంధనల ప్రకారం ఆయనకు ఏకంగా రూ.1,500 జరిమానా విధించారు.

ఈ ఘటనతో ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు అందరినీ సమానంగా చూస్తారనే సందేశం వెళ్లింది. ప్రజాప్రతినిధి అయినా, సామాన్యుడైనా రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఈ ఘటన స్పష్టం చేసింది.

అసెంబ్లీకి వెళ్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన ఎమ్మెల్యే

పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ఎన్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముత్యాల్‌పేట ఎమ్మెల్యే వయ్యాపురి మణికందన్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఎమ్మెల్యే మణికందన్ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అయితే ఆయన నడుపుతున్న వాహనానికి నంబర్ ప్లేట్ లేకపోవడంతో పాటు, ఆయన హెల్మెట్ కూడా ధరించలేదు.

ఈ విషయాన్ని గమనించిన పుదుచ్చేరి తూర్పు విభాగం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటాచలపతి ఎమ్మెల్యేను ఆపారు. వాహనదారుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ, ఎలాంటి మినహాయింపు ఇవ్వకుండా మోటారు వాహనాల చట్టం ప్రకారం రూ.1,500 జరిమానా విధించారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే విషయంలో వ్యక్తి హోదాతో సంబంధం లేకుండా చట్టం అందరికీ సమానమేనని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి పక్షపాతం లేకుండా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు సంకేతం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *