
మురసు తుపాను ప్రభావంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన 12 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
ఇండిగో సంస్థ హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, ముంబై, కర్నూలు నగరాలకు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది. అలాగే ఎయిరిండియా సంస్థ హైదరాబాద్, విశాఖపట్నం సర్వీసులను నిలిపివేసింది. మరోవైపు భోగాపురం, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి విజయవాడ, తిరుపతి, హైదరాబాద్కు వెళ్లాల్సిన కొన్ని విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.
వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు ప్రయాణికులు తమ విమానాల తాజా స్థితిగతులను సంబంధిత ఎయిర్లైన్స్ ద్వారా తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
మరోవైపు మురసు తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
