
D Educt: Nov 3: ఏపీఓఎస్‌ఎస్ ప్రవేశాల గడువు పొడిగింపు.. నవంబర్ 15 వరకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (APOSS) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి పదో తరగతి (SSC), ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. ఈ మేరకు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఆర్. నరసింహారావు ఉత్తర్వులు జారీ చేశారు.
నవంబర్ 15 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేదు
పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోగా ఎలాంటి అపరాధ రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఆలస్య రుసుముతో మరో అవకాశం
నవంబర్ 15లోగా ప్రవేశాలు పొందలేని అభ్యర్థులకు కూడా మరో అవకాశం కల్పించారు. అలాంటి వారు రూ.200 ఆలస్య రుసుము చెల్లించి నవంబర్ 16 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
దీంతో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాలనుకునే వారికి మరికొంత సమయం లభించనుంది.
