
D Spiritual: Nov 19: శ్రీశైలం: నిత్య అన్నదాన పథకానికి రూ.లక్షకు పైగా విరాళం
శ్రీశైలం, నవంబర్ 18: శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన వితరణ పథకానికి విశాఖపట్నానికి చెందిన దాతలు విరాళం అందజేశారు. విశాఖపట్నం వాస్తవ్యులు ఆర్. రంగారావు, సింహాచలం బుధవారం దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావును కలిసి రూ.1,00,116 నగదును విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేవస్థానం తరఫున విరాళానికి సంబంధించిన రసీదుతో పాటు స్వామివారి ప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.
