D Spiritual: Nov 23: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సినీనటి శిల్పాశెట్టి దంపతులు

ప్రముఖ సినీనటి, మోడల్ శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి ఆదివారం సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా శిల్పాశెట్టి దంపతులు ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, అంతరాలయంలో కొలువైన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

దర్శనం అనంతరం ఆలయ బేడా మండపంలో పండితులు వేదమంత్రాలతో శిల్పాశెట్టి దంపతులను ఆశీర్వదించారు. ఈవో వెంకటరావు వారికి స్వామివారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో శిల్పాశెట్టి వెంట భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ, 120వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన పీవీ నరసింహం పాల్గొన్నారు. ప్రముఖ సినీనటి శిల్పాశెట్టిని చూసేందుకు ఆలయానికి వచ్చిన భక్తులు ఆసక్తి చూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *