D Spiritual: Nov 23: మంథనిలో ఈ నెల 24న గౌతమేశ్వర స్వామివారి కల్యాణం, జ్వాలాతోరణం

మంథని: పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంథని పట్టణంలోని పవిత్ర గోదావరి నదీ తీరాన కొలువుదీరిన శ్రీ గౌతమేశ్వర స్వామి సమేత గంగాభవాని అమ్మవారి కల్యాణ మహోత్సవం, జ్వాలాతోరణ కార్యక్రమాన్ని ఈ నెల 24న మంగళవారం నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఆలయంలో ఈ వేడుకలు జరగనున్నట్లు బండారి గురుస్వామి శిష్య పరివార్‌కు చెందిన ఆకుల విద్యాసాగర్ ఆదివారం తెలిపారు.

ఈ పవిత్ర వేడుకలను భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, దైవానుభూతిని కలిగించేలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. గోదావరి నదీ తీరాన జరిగే ఈ కల్యాణ మహోత్సవం, జ్వాలాతోరణ కార్యక్రమానికి మంథని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు.

ఈ సందర్భంగా భక్తులందరూ కుటుంబసమేతంగా హాజరై శ్రీ గౌతమేశ్వర స్వామి సమేత గంగాభవాని అమ్మవారి కల్యాణాన్ని తిలకించాలని, జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *