నేరాల దర్యాప్తు నేర నిర్ధారణలో వేలిముద్రల సాక్ష్యాలు కీలక పాత్ర పోషిస్తాయని ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో అధికారులు పేర్కొన్నారు. శాస్త్రీయ ఆధారాల ద్వారా నేరాలను నిర్ధారించడంలో వేలిముద్రల విశ్లేషణకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించేందుకు పలువురు న్యాయమూర్తులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏపీసీఐడీ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. వివిధ జిల్లాలకు చెందిన న్యాయమూర్తులు జూనియర్‌ సివిల్‌ జడ్జీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫింగర్‌ ప్రింట్స్‌ డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసరావు నేతృత్వంలోని నిపుణుల బృందం న్యాయమూర్తులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించింది. నేరం జరిగిన ప్రదేశం నుంచి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించే విధానం వాటిని భద్రపరిచే పద్ధతులు, దర్యాప్తులో వేలిముద్రల శాస్త్రీయ విశ్లేషణ వంటి అంశాలను వివరించింది.

అలాగే న్యాయస్థానాల్లో వేలిముద్రల ఆధారాలకు ఉన్న సాక్ష్యాధార విలువ నేర నిర్ధారణలో వాటి ప్రాముఖ్యతను నిపుణులు వివరించారు. శాస్త్రీయ ఆధారాలపై న్యాయమూర్తులకు అవగాహన పెంపొందించడం ద్వారా న్యాయ ప్రక్రియలో ఫోరెన్సిక్‌ సాక్ష్యాల వినియోగం మరింత సమర్థవంతంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *