
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు, ఆక్వా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆయన ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు.
సుదీర్ఘ సముద్ర తీరం, డెల్టాలు, విస్తారమైన జలవనరులతో ఆంధ్రప్రదేశ్ బ్లూ ఎకానమీలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా అండగా నిలుస్తోందని తెలిపారు.
మత్స్యకారుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధే ఆంధ్రప్రదేశ్ ప్రగతికి కీలకమని పేర్కొన్న ఆయన ఈ రెండు రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
