ఆంధ్రప్రదేశ్‌‌లో విద్యార్థులకు శుభవార్త.. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఎక్సలెన్స్‌ సెంటర్లలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంటర్‌తో పాటుగా ఐఐటీ/జేఈఈ, నీట్‌ కోచింగ్‌ అందిస్తారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎంపీసీ/బైపీసీ కోర్సుల్లో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఏడాది సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇవి మేఘాద్రిగడ్డ, తాడికొండ, కోటలో ఉన్నాయి. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య అందించేందుకు ప్రభుత్వం కొత్తగా 3 ఎక్స్‌లెన్స్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ మూడు సెంటర్లలో ప్రవేశాల కోసం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మూడు ఎక్స్‌లెన్స్ సెంటర్లు.. విశాఖపట్నంలోని మేఘాద్రిగడ్డ, అమరావతిలోని తాడికొండ, నెల్లూరు జిల్లాలోని కోటలో ఏర్పాటు చేశారు. ఈ మూడుచోట్ల ఏర్పాటు చేసిన ఈ సెంటర్లలో ఇంటర్మీడియట్‌తోపాటు జేఈఈ, నీట్‌లకు శిక్షణ అందిస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఒక్కో ఎక్స్‌లెన్స్ సెంటర్‌లో 600 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ ఫస్టియర్‌లో ఎంపీసీలో బాలురు 75 మంది, బాలికలు 75 మంది ఉంటారు. అలాగే సెకండియర్‌ ఎంపీసీలో బాలురు 75 మంది, బాలికలు 75 మంది ఉంటారు. బైపీసీలో కూడా ఫస్టియర్ బాలురు 75, బాలికలు 75మంది ఉంటారు. సెకండియర్‌ బైపీసీలో బాలురు 75, బాలికలు 75మంది ఉంటారు. ఒకే క్యాంపస్‌లలో బాలురు, బాలికలకు వేర్వేరుగా సెంటర్లు నిర్వహిస్తారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభంకావడంతో.. ఈ సెంటర్లలో అడ్మిషన్ల ప్రక్రియ ఎలా ఉంటుందనేది చూడాలి. ఏపీ ప్రభుత్వం మరికొన్ని ఎక్స్‌లెన్స్ సెంటర్లను కూడా ప్రారంభించాలని భావిస్తోంది.

By Ramya