ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ జాతికి అంకితం చేసేందుకు టైమ్ ఫిక్స్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Date:

పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నట్టు ప్రకటించారు. అంతకంటే ముందే. పోలవరం ఎడమ కాల్వ నుంచి నీటి విడుదలకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. వచ్చే నెల 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇవ్వబోతున్నట్టు చంద్రబాబు వెల్లడించడం ఉత్తరాంధ్రకు ఊపిరిపోస్తోంది.

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సందర్శించారు. ఏరియల్‌ వ్యూ ద్వారా పోలవరం పరిసరాలను పరిశీలించారు. ప్రాజెక్టు స్పిల్‌ వే నుంచి గోదావరి వరద నీటి ప్రవాహం, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ మధ్య జరుగుతున్న పనులను తిలకించారు. పోలవరం పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపైనా అక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా.

పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి. జాతికి అంకితం చేయబోతున్నట్టు వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి ఏపీ ప్రజల దశాబ్ధాల కోరిక నెరవేరబోతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అంతకంటే ముందు వచ్చే నెల ఆగస్ట్‌ 14న పోలవరం ఎడమ కాలువకు నీటిని విడుదల చేయబోతున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనకాపల్లి జిల్లాలో గోదావరికి అఖండ హారతి ఇస్తామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటివరకు 37 సార్లు పోలవరం ప్రాజెక్ట్‌ను స్వయంగా పరిశీలించడంతోపాటు 136సార్లు సమీక్ష నిర్వహించామని చెప్పారు. అలాగే.. కేంద్రంతో అనేకసార్లు మాట్లాడి పోలవరం నిధులు విడుదల అయ్యేలా చూశామన్నారు. బైట్‌ చంద్రబాబు, ఏపీ సీఎం

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...