
ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. అర్హత కలిగిన ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను యూనిట్‌కు కేవలం రూ.1.50కే అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.
ఈ మేరకు సంబంధించిన జీవోను మంగళవారం పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు విడుదల చేశారు. అర్హత ఉన్న ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్‌ను అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నిర్ణయం ఆక్వా రంగంపై విద్యుత్ వ్యయ భారాన్ని తగ్గించి రైతులకు కొంత ఉపశమనం కలిగించనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు శుభవార్త అందించింది. ఆక్వా రైతులకు అందిస్తున్న సబ్సిడీ విద్యుత్ సౌకర్యాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్‌కు సంబంధించి ఏపీ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ మంగళవారం జీవో ఆర్టీ నంబర్ 57ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం అర్హత కలిగిన ఆక్వా రైతులకు విద్యుత్‌ను యూనిట్‌కు కేవలం రూ.1.50కే అందించనున్నారు.
ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన ఆక్వా ఫారాలకు ఈ విద్యుత్ రాయితీ వర్తించనుంది. అలాగే APSADA, CAA చట్టాల కింద రిజిస్టర్ అయి, నిర్దేశించిన అన్ని అర్హతలు కలిగిన ఆక్వా ఫారాలకు కూడా సబ్సిడీ విద్యుత్ సౌకర్యం అందించనున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఆక్వా రైతుల విద్యుత్ ఖర్చులు తగ్గి, ఉత్పత్తి వ్యయంపై కొంత భారం తగ్గే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,500 ఆక్వా ఫారాలకు ఈ విద్యుత్ రాయితీ వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కొత్తగా రిజిస్ట్రేషన్ పొందే ఆక్వా ఫారాలకు కూడా రిజిస్ట్రేషన్ జరిగిన తేదీ నుంచే సబ్సిడీ విద్యుత్ సౌకర్యం అందించనున్నారు.
ఇప్పటికే 2026 జూన్ 1 నుంచి ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆక్వా ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీ విద్యుత్ సౌకర్యాన్ని కొనసాగిస్తోంది.
అర్హత కలిగిన ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్ అందేలా వారి వివరాలను ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంబంధిత విద్యుత్ డిస్కమ్‌లకు అందించనుంది.

