
బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి భారీ ఊరట లభించింది. దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,780 తగ్గగా, 22 క్యారెట్ల బంగారంపై రూ.2,550 మేర ధర తగ్గింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ.5,000 పడిపోయింది. దీంతో కొనుగోలుదారులకు కొంత ఊరట కలిగింది.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,780 తగ్గి రూ.1,33,260కు చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,550 తగ్గి రూ.1,22,150 వద్దకు దిగివచ్చింది.
పసిడితో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గడంతో ప్రస్తుతం ధర రూ.1.85 లక్షలకు చేరింది. ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలు భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారులు మార్కెట్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.
ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| విజయవాడ | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
| విశాఖపట్నం | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
| అమరావతి | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
| కాకినాడ | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
| తిరుపతి | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| హైదరాబాద్ | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
| వరంగల్ | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
| నిజామాబాద్ | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
| ఖమ్మం | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| చెన్నై | ₹1,33,260 | ₹1,22,150 | ₹1,00,000 |
| ముంబై | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
| ఢిల్లీ | ₹1,33,410 | ₹1,22,300 | ₹1,00,100 |
| కోల్‌కతా | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
| కేరళం | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
| పుణె | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
