ఆ ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ తోపు.. ఏకంగా రూ. 8562 కోట్లు.. ఇక్కడే చీప్.. సౌత్ ఇండియాలోనే టాప్

Date:

కొంత కాలంగా రియల్ ఎస్టేట్ పరంగా దూసుకెళ్తున్న హైదరాబాద్.. ఇప్పుడు సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తుంది. లగ్జరీ హౌసింగ్ మార్కెట్ సెగ్మెంట్‌లో దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్ గత ఆర్థిక సంవత్సరంలో టాప్‌లో నిలిచింది. రూ. 10 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్‌లోనే ఎక్కువ జరగడం విశేషం. విలువ పరంగా చూస్తే బెంగళూరు కంటే ఏకంగా 4 రెట్లు అధికంగా హైదరాబాద్ నుంచే వచ్చింది.

ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 128 అల్ట్రా లగ్జరీ హౌసింగ్ యూనిట్లే అమ్ముడుబోగా.. దీని విలువ రూ. 1957 కోట్లుగా ఉంది. దీని కంటే హైదరాబాద్ లగ్జరీ ఇళ్ల విక్రయాల విలువ 4 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. సంఖ్యా పరంగా కూడా దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉంది. ఇక చెన్నైలో 58 అల్ట్రా లగ్జరీ యూనిట్లు విక్రయించగా వీటి విలువ కేవలం రూ. 727 కోట్లుగా ఉంది.

బెంగళూరు, చెన్నైతో పోలిస్తే రూ. 10 కోట్లు అంతకంటే ఎక్కువ వెచ్చిస్తే.. హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్లు ఎక్కువ విస్తీర్ణంతో అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ సేల్స్ పెరిగినట్లు తెలుస్తోంది. రూ. 10 కోట్ల పెట్టుబడికి హైదరాబాద్ నగరంలో సుమారు 6,210 చదరపు అడుగుల విశాలమైన ఇళ్లు లభిస్తుండటం కారణం. రూ. 10 కోట్ల ధరకు చూస్తే.. బెంగళూరు కంటే హైదరాబాద్ నగరంలో దాదాపు 60 శాతం ఎక్కువ స్పేస్ లభిస్తుందని రిపోర్ట్ చెప్పడం గమనార్హం.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...