తెలుగు రాష్ట్రాల్లో హైలెస్సో హైలెస్సా.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా టేకాఫ్.. మామూలుగా ఉండదు మరి..

Date:

భోగాపురం నుంచి మామునూరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతుండగా.. వరంగల్ మామునూరు, ఆదిలాబాద్, ఒంగోలు, పలాస, కడప, కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయాల అభివృద్ధి ప్రణాళికలు కూడా ముందుకు సాగుతున్నాయి. ప్రతి రెండు ఉమ్మడి జిల్లాలకు ఒక విమానాశ్రయం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.

కేవలం బిగ్‌షాట్‌లకే కాదు, మిడిల్‌క్లాసోడిక్కూడా చేతికి అందేంత దూరంలో ఉండాలి విమానప్రయాణం. ఫ్లైట్ ఎక్కి ఆకాశంలో ఎగరాలన్న కల ఎవ్వరైనా కనొచ్చు. ఎవ్వరైనా సాకారం చేసుకోవచ్చు. దీన్నే జీవితాశయంగా తీసుకుని ప్రభుత్వాలతో పోరాడి, కార్పొరేట్ శక్తులతో కొట్లాడి ‘ఎయిర్‌ డెక్కన్’ అనే సంస్థకు పునాది వేశారు కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్. పెద్దోడని, పేదోడని, బిజినెస్ క్లాస్ అనీ, ఎకానమీ క్లాస్ అని విడదీస్తే విడదీశారు, కనీసం విమానం ఎక్కే అవకాశాన్నైనా అందరికీ దక్కేలా చేద్దాం అనే ఆయన స్వప్నమైతే సాకారమైంది. చౌకధరకే విమాన ప్రయాణం అనే కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే గ్రౌండ్‌లెవల్‌కి చేరుతోంది. ఎయిర్‌లైన్స్ సంస్థల మధ్య పోటీపెరిగింది. రైల్లో స్లీపర్ క్లాస్‌తో సరిసమానంగా దిగొచ్చేశాయి ఫ్లైయింగ్ ఛార్జెస్. కానీ, ఎక్కాల్సిన విమానాలెక్కడ? విమానాలు దిగాల్సిన చోటెక్కడ? ఔను, విమానాశ్రయాల కొరత ఒకప్పుడు మన దేశంలో అతిపెద్ద సమస్య. ఇప్పుడు పరిష్కారం దిశగా దూసుకెళుతోంది. తెలుగురాష్ట్రాల్లో ఐతే జోరుగా మొదలైనట్టుంది ఎయిర్‌పోర్టుల మేళా. భోగాపురం టు మామునూరు.. ప్రతి రెండు జిల్లాలకు ఒక ఎయిర్‌పోర్ట్ మోదీ క్యాబినెట్‌లో సివిల్ ఏవియేషన్ పోర్ట్‌పోలియో ఏపీ చేతుల్లోకొచ్చిన తర్వాత, రామ్మోహన్‌నాయుడు విమానాల మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత, వడ్డించేవాడు మనోడైన తర్వాత… తెలుగురాష్ట్రాల్లో పౌరవిమానయానం గేర్ మార్చుకుంది. రాకెట్‌ వేగంతో దూసుకుపోతోంది. ఫస్ట్ మెగా టేకాఫ్ ఫ్రమ్ భోగాపురం. సర్వాంగ సుందరంగా సిద్ధమై ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం కాబోతోంది భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...