
కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో అర్ధరాత్రి జరిగిన దారి దోపిడీ తీవ్ర కలకలం రేపింది. ముసుగులు ధరించి ఆయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి, వృద్ధుడిపై దాడి చేసి బంగారం, రూ.50 లక్షలకు పైగా నగదును దోచుకెళ్లారు.
దుండగులు ఇంట్లోని మహిళలను కత్తులు, పిస్టళ్లతో బెదిరించి కాళ్లు, చేతులు కట్టేశారు. అనంతరం ఇంటి ముందు ఉన్న రెండు బైకులను కూడా తీసుకుని పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారు వరంగల్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ వివాదాలు, వృత్తిపరమైన దొంగల ప్రమేయం సహా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

