80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ గీతం అనంతరం సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు.
ఎనిమిది దశాబ్దాల స్వతంత్ర భారత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. దేశం అభివృద్ధి, ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సందేశమిచ్చారు.
దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ.. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశ గౌరవం, ఐక్యత, స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకగా ఎల్లప్పుడూ ఎగురుతూ ఉండాలని ఆకాంక్షించారు.

