విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

Date:

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. కోట్లాది మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని పేర్కొన్నారు. నేడు ప్రతి భారతీయుడి హృదయంలో జాతీయ పతాకం రెపరెపలాడుతోందని అన్నారు.

స్వర్ణాంధ్ర సాధనకు అందరూ ఏకం కావాలి

‘ఒక రాష్ట్రం–ఒక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ’ తమ ప్రభుత్వ విధానమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యమన్నారు.

2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామని చెప్పారు.

కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకమై ‘స్వర్ణాంధ్ర’ సాధనకు కృషి చేయాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...