ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా వందన కార్యక్రమంలో హాజరైయ్యను. ఈ సందర్భంగా స్వతంత్రం కోసం పోరాడిన మహానుభావుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళ్లు అర్పించి, జాతీయ గీతం ఆలపించిన అనంతరం సచివాలయ ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసి ప్రజా సేవలో ఉన్న పలువురిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశాను. అనంతరం చిలకలూరిపేట తహసీల్దారు కార్యాలయం నందు జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థులకు బుక్స్ అందజేయటం జరిగింది.



శారద స్కూల్ నందు స్వత్రంత దినోత్సవం సందర్భంగా నూతన తరగతి గదులను ప్రారంభించి, జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం యన్.సి.సి. విద్యార్థులు చేసిన మార్చ్ ఫస్ట్ ఎంతో ఆకట్టుకుంది. గవర్నమెంట్ హాస్పిటల్ నందు జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జెండా వందన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. మార్కెట్ యార్డు నందు జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది.



