
ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జిల్లా ఎస్పీ, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
‘నేషన్ ఫస్ట్’ నినాదంతో జాతీయ సమగ్రతను కాపాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్–వికసిత్ భారత్ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

