కొరియా కంపెనీలకు లోకేశ్‌ ఆహ్వానం బుసాన్‌లో APEX-Korea ప్రారంభం

Date:

  • దక్షిణ కొరియా/అమరావతి, జులై 8: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఏపీలో పెట్టుబడులపై కొరియా సంస్థలతో వరుసగా చర్చలు నిర్వహిస్తున్నారు. బుసాన్‌లో APEX-Korea పెట్టుబడిదారుల సహాయ కేంద్రం ప్రారంభమైంది. ఏపీఈడీబీ ఆధ్వర్యంలో APEX-Korea కేంద్రాన్ని లోకేశ్ ప్రారంభించారు.
  • కొరియా సంస్థలు, ఏపీ ప్రభుత్వం మధ్య అనుసంధాన వేదికగా APEX-Korea నిలవనుంది. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపే కొరియా కంపెనీలకు పూర్తి సహకారం అందించనుంది. ఏపీలో ఇప్పటికే ఉన్న కొరియా సంస్థలకు APEX-Korea సేవలు అందించనుంది. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల విస్తరణే లక్ష్యంగా APEX-Koreaను ఏర్పాటు చేశారు.
  • ఈ సందర్భంగా బుసాన్‌లో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను కొరియా సంస్థలకు వివరించారు. బీఎన్‌కే ఫైనాన్షియల్ గ్రూప్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. అమరావతిలో బీఎన్‌కే ఫైనాన్షియల్ శాఖ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.
  • అమరావతి, పారిశ్రామిక పార్కులకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, షిప్‌బిల్డింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఏపీని పెట్టుబడులు, ఉత్పత్తి కేంద్రంగా ఎంచుకోవాలని కొరియా సంస్థలకు పిలుపునిచ్చారు. స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలకు మద్దతుగా ఆర్‌టీఐహెచ్‌‌లో(RTIH) భాగస్వామ్యం కావాలని బీఎన్‌కేను మంత్రి ఆహ్వానించారు.
  • ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని బీఎన్‌కే ప్రతినిధులు తెలిపారు. బీఎన్‌కే ఫైనాన్షియల్ గ్రూప్ ఏకీకృత ఆస్తుల విలువ రూ.9.64 లక్షల కోట్లు కాగా.. మూడు బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థలతో ఈ గ్రూప్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. బీఎన్‌కే గ్రూప్‌కు కొరియాలో 398 శాఖలు, విదేశాల్లో 75 అవుట్‌లెట్లు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....