పెళ్లి చేసుకుందేమో ఆంధ్రప్రదేశ్‌లో.. విడాకులు యూకేలోనా.. NRIపై సుప్రీం కోర్టు సీరియస్

Date:

వివాహం ఇక్కడ.. విడాకులు విదేశాల్లోనా? అంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం ఏపీకి చెందిన వ్యక్తిని ప్రశ్నించింది. యూకే కోర్టు ఇచ్చిన డిక్రీకి భారతీయ కోర్టులు కట్టుబడాలా? అంటూ సీరియస్ అయ్యింది. పెళ్లి హిందూ వివాహ చట్టం కింద జరిగింది కాాబట్టి.. అదే చట్టం కింద మాత్రమే విడాకులు తీసుకోవాలి, పెళ్లి రద్దు చేయగలమని వ్యాఖ్యనాచించింది.. విదేశాల్లో విడాకులు తీసుకోవడానికి కుదరదని తేల్చి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెళ్లి చేసుకుని.. విదేశాల్లో విడాకులు తీసుకోవడంపై సుప్రీం కోర్టు సీరియస్‌గా స్పందించింది. మన దేశంలో హిందూ వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్న భార్యాభర్తలకు విదేశీ కోర్టులు విడాకులు ఇవ్వొచ్చా అంటూ ప్రశ్నించింది. మన దేశంలోని కోర్టులు విదేశీ కోర్టుల డిక్రీలకు కట్టుబడి ఉండాలా అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. మన న్యాయవ్యవస్థ భారతీయ మహిళను భర్త వదిలేసినా ఆమెకు న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండాలా అంటూ ప్రశ్నించింది. విచారణ సమయంలో జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ శ్రీచంద్రశేఖర్‌ల నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి పల్నాడు 2003లో ఇక్కడ పెళ్లి చేసుకుని ఇంగ్లండ్‌ వెళ్లారు. అక్కడ బాబు పుట్టిన తర్వాత భార్యతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2010లో సత్తెనపల్లి కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. కొంత కాలం తర్వాత ఆ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుని.. యూకేకి వెళ్లిపోయారు. అక్కడితో ఆగకుండా ఆయన విదేశాల్లో నివాసం ఉంటున్న చోట కోర్టులో పిటిషన్‌ వేశారు. 2014 జనవరి 29న కేంబ్రిడ్జి కౌంటీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ డిక్రీ ఇచ్చింది.. శ్రీధర్ రెడ్డి రెండో పెళ్లి కూడా చేసుకున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...