
పీఎం-కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 9.34 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ నిధులు జమ చేయనున్నారు.
24వ విడతలో భాగంగా మొత్తం రూ.18,690 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. గుజరాత్‌లోని బనస్కాంతలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులను విడుదల చేయనున్నారు. మధ్యప్రదేశ్‌లోని రైసన్ నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) కింద ఏర్పాటు చేసిన 521 యూనిట్లను ప్రధాని ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు.
