
పులివెందులలో కొందరు గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కూటమి పార్టీల నేతలు పోలీసులను రెచ్చగొట్టేలా వ్యవహరించినప్పటికీ.. కూటమి నేతలు కార్యకర్తలు సంయమనం పాటించారని తెలిపారు.
ఆదివారం కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నేతలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.
