భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల (RRB) పరిధిలో 4,098 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలను RRB తాజాగా విడుదల చేసిన CEN 04/2026 నోటిఫికేషన్ ద్వారా చేపడుతోంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు
ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 14, 2026న ప్రారంభమై.. సెప్టెంబర్ 13, 2026 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీ నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం ఎంత?
ఎంపికైన అభ్యర్థులకు లెవల్-6 పే మ్యాట్రిక్స్ ప్రకారం ప్రారంభ ప్రాథమిక వేతనం రూ.35,400గా ఉంటుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్సులు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి తదుపరి దశల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ వంటి ప్రక్రియలు ఉంటాయి.
ఇంజినీరింగ్ లేదా సంబంధిత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు పోస్టుల వారీగా అర్హతలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, ఫీజు, పోస్టుల వివరాలు పూర్తిగా పరిశీలించడం మంచిది.

