రీల్స్ తెచ్చిన తంటా.. అన్యాయంగా 13 ఏళ్ళ బాలిక బలి.. అసలేమైందంటే?

Date:

‘సోషల్ మీడియా రీల్స్’ వ్యామోహం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. యువతలో రీల్స్ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతోంది. రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదకు వస్తుందని తెలిసినా.. ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. తిరుపతి జిల్లాలో రీల్స్ కోసం ప్రయత్నించి ఓ బాలిక మృతి చెందింది.. దీంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారెడ్డి నగర్‌లో ఈ విషాద ఘటన జరిగింది. అటు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నేపాల్‌కు చెందిన ధను బహదూర్ కుటుంబం కుటుంబం జీవనోపాధి కోసం తిరుపతికి వలస వచ్చారు. సాయి నివాస్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా ధను బహదూర్ పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. ధను బహదూర్ దంపతుల 13 ఏళ్ల కూతురు పుష్ప రీల్స్ వీడియోలు తీస్తూ ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి కింద పడిపోయింది. బయటకు వెళ్లిన కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. తల్లి పుష్పను తల్లి వెతుకుతుండగా అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తుకు వెళ్లారు. అయితే ఆమె ప్రమాదవశాత్తు ఐదవ అంతస్తుపై నుంచి పడినట్లు గుర్తించారు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా మోజు చిన్నారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది....

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్.. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్...

ఆరుగురిని చంపిన హంత‌కుడికి అనాథ‌లా అంత్య‌క్రియ‌లు.. కుటుంబ సభ్యులు వద్దనడంతో.. ఎవరు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక...

సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు.. ఏడాది జైలుశిక్ష పడే అవకాశం ఉందా?

రాష్ట్రంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా.....