RK Beach: సరదాగా వైజాగ్ వెళ్లిన జగిత్యాల కుటుంబం.. ఆర్కే బీచ్‌లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం!

Date:

RK Beach: తెలంగాణ జగిత్యాల రైకల్ గ్రామానికి చెందిన సుజాత, మల్లికార్జున్ రావు, శిరీష ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళందరూ కలిసి విశాఖ ఆర్కే బీచ్కు వెళ్లారు. సరదాగా సముద్ర కెరటాల చూసి నీటిలోకి వెళ్లారు. స్నానం చేస్తూ కేరింతలు కొడుతున్నారు. కెరటాల పెరగడంతో..

జగిత్యాలకు చెందిన కుటుంబం.. విశాఖకు వచ్చారు.. వైజాగ్ లోనే బీచ్ చూడకుండా తిరిగి వెళ్ళలేరు కదా ఎవరైనా.. అందుకే సరదాగా ఆర్కే బీచ్ కి వెళ్లారు. అక్కడ సముద్రపు ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఇంతలో కెరటాలు కవ్వించాయి.. సముద్రంలో దిగకుండా ఉండలేకపోయారు.. ఇంతలోనే ఓ భారీ కెరటం ఇద్దరిని లోపలికి లాక్కెళ్ళెంత పనైంది. అప్రమత్తమమైన సహచరులు ఒకరిని సురక్షితంగా బయటకు లాగారు. కానీ మరొకరు కెరటాల అభివృద్ధికి లోపలకు కొట్టుకుపోతున్నారు. స్థానికులు అరుపులు కేకలు పెట్టారు. వెంటనే అక్కడే ఉన్న లైఫ్ గార్డ్స్ అప్రమత్తమయ్యారు.

తెలంగాణ జగిత్యాల రైకల్ గ్రామానికి చెందిన సుజాత, మల్లికార్జున్ రావు, శిరీష ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళందరూ కలిసి విశాఖ ఆర్కే బీచ్కు వెళ్లారు. సరదాగా సముద్ర కెరటాల చూసి నీటిలోకి వెళ్లారు. స్నానం చేస్తూ కేరింతలు కొడుతున్నారు. కెరటాల పెరగడంతో వారిలో ఇద్దరు బయటకు వచ్చేసారు. సుజాత లోపలకు వెళ్ళిపోయారు. దీంతో సుజాతతో పాటు వచ్చిన ఇద్దరు కేకలు పెట్టారు. స్థానికులు అప్రమత్తమయ్యారు. లైఫ్ గార్డ్స్ విషయం గమనించి పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న ఇద్దరు యువకుల సహాయంతో సుజాతను లైఫ్ గాడ్స్ రెస్క్యూ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...