రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్?… ‘బైకర్’ ట్రైలర్ లాంచ్‌లో క్లారిటీ ఇచ్చిన హీరో

Date:

టాలీవుడ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ తన తాజా చిత్రం ‘బైకర్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో రోహిత్ శర్మ బయోపిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శర్వానంద్ ఫిజిక్ రోహిత్ శర్మకు దగ్గరగా ఉంటుందని, ఆయన బయోపిక్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. “రోహిత్ శర్మ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని, తన వద్దకు అటువంటి కథ వస్తే నటించడానికి సిద్ధమేనని” శర్వానంద్ తన మనసులోని మాటను బయటపెట్టారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఏప్రిల్ 3న విడుదల కానున్న ‘బైకర్’ సినిమాలో శర్వానంద్ రేసర్ పాత్రలో నటిస్తున్నారు.

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో ఘనవిజయం అందుకుని మంచి ఊపు మీద ఉన్న ఆయన, ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ ‘బైకర్’ (Biker)తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ‘బైకర్’ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...