Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!

Date:

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలో భారీ చిట్టీ మోసం వెలుగుచూసింది. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి స్థానిక మహిళల నుంచి కోట్ల రూపాయలు సేకరించిన దంపతులు ఒక్కసారిగా పరారవడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు.

స్థానికంగా శిరీష, సాంబశివరావు దంపతులు గత కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అధిక రాబడులు వస్తాయని నమ్మించి కాలనీలోని మహిళల నుంచి సుమారు రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. శిరీష ‘సాయి గణేష్ టెక్స్‌టైల్స్’ పేరుతో వస్త్ర దుకాణం నిర్వహిస్తూనే, మరోవైపు చిట్టీల వ్యాపారాన్ని కూడా కొనసాగించినట్లు తెలుస్తోంది. స్థానికుల విశ్వాసాన్ని సంపాదించిన అనంతరం భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బాధితుల వివరాల ప్రకారం.. దంపతులు తమకు చెందిన ఇంటిని విక్రయించిన అనంతరం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు.

ఫిర్యాదు స్వీకరించిన అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా...