
D News: Nov 5: 2,721 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ను నవంబరు 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత విడుదల చేసింది. మొత్తం 2,721 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నుంచి నవంబరు 11 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
డీఎస్సీ పరీక్షలను డిసెంబరు 20 నుంచి జనవరి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థుల సన్నద్ధత కోసం డిసెంబరు 5న ఆన్లైన్ మాక్ టెస్ట్ నిర్వహిస్తారు. డిసెంబరు 14వ తేదీ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
చివరి పరీక్ష పూర్తయిన రెండు రోజుల తర్వాత ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు వారం రోజుల గడువు ఇస్తారు. అనంతరం మరో వారం రోజుల్లో తుది ఆన్సర్ కీని విడుదల చేస్తారు.
పోస్టులకు సంబంధించిన రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు, హారిజాంటల్ రిజర్వేషన్ వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించనున్నారు. క్రీడాకోటా అభ్యర్థులకు కూడా రాతపరీక్ష తప్పనిసరిగా నిర్వహిస్తారు.
