ఏపీలోని కలెక్టరేట్‌లలో ఉద్యోగుల తగ్గింపు.. ఇకపై 85మంది మాత్రమే, కారణ ఏంటంటే!

Date:

ఏపీలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో అధికారులు, సిబ్బంది సంఖ్య ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్తగా ఏర్పాటైన రెండు జిల్లాలు సహా మొత్తం 28 జిల్లా కలెక్టరేట్లలో ఒకే రకమైన కేడర్ స్ట్రెంగ్త్ అమల్లోకి తీసుకొచ్చారు.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టరేట్‌కు 85 పోస్టులు మాత్రమే ఉంటాయి. వీటిలో 53 రెగ్యులర్ , 32 ఔట్‌సోర్సింగ్ పోస్టులు ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్‌లలో ఉద్యోగుల్ని రేషనలైజేషన్ చేస్తూ సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఒక్కో జిల్లా కలెక్టరేట్‌లో ప్రస్తుతం 95 పోస్టులు ఉండగా.. ఇకపై అన్ని జిల్లా కలెక్టరేట్‌లలో 85మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఈ 85మందిలో రెగ్యులర్‌ ఉద్యోగులు 53, ఔట్‌ సోర్సింగ్‌ 32 మంది ఉద్యోగులు ఉండేలా ఉత్తర్వులు జారీ చేశారు. పాత జిల్లాల్లో ఉన్న మిగులు పోస్టుల్ని కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.

ఒక్కో కలెక్టరేట్‌లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, డిప్యూటీ కలెక్టర్, ఏవో, సూపరింటెండెంట్స్, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డ్‌ అసిస్టెంట్, జమేదార్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, డ్రైవర్లు , ఆఫీస్‌ సబార్డినేట్స్‌, వాచ్‌మెన్‌ పోస్టులను నియమిస్తారు. రాష్ట్రంలోని 28 జిల్లా కలెక్టరేట్ల పరిధిలో ఒకే విధంగా అధికారులు, సిబ్బంది ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్తగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గతంలో కలెక్టరేట్‌లలో ఉండే తహశీల్దార్లతో పాటుగా డిప్యూటీ తహశీల్దార్లు కూడా విధుల్లో ఉంటారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్‌, మండలాలకు కూడా అధికారులు, సిబ్బంది సంఖ్యను పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఒక్కో రెవెన్యూ డివిజన్‌కు 17 పోస్టులు ఉంటాయి.. అదే మండలానికి అయితే 11 పోస్టులు మంజూరు చేశారు. పరిపాలనలో సమర్థత, అన్ని జిల్లాల్లో సమానంగా సిబ్బంది ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద అన్ని జిల్లా కలెక్టరేట్‌లలో ఉద్యోగులకు సంబంధించి కీలక మార్పులు జరిగాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...