ఎండాకాలం స్పెషల్: ఏసీనా లేక కూలరా? ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం? నిపుణుల సూచనలు

Date:

వేసవికాలం మొదలైంది.. మార్చి నెల ప్రారంభంతోనే ఎండల తీవ్రత ఎక్కువవుతోంది. ఇప్పటికే ఉదయం 10 దాటిందంటే ఎండలు దంచికొడుతున్నాయి. ఇక ముందు ముందు మాడు పగిలే వేడి ఖాయం అన్నట్టుగానే ఉంది పరిస్థితి. వేసవి ఉక్కపోత, వేడిగాలుల నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఇంట్లోనూ ఏసీలు, కూలర్లు ఉపయోగిస్తారు. అయితే, ఏసీనా లేక కూలరా? దేనిలో నిద్రపోవడం వల్ల శరీరానికి ఎక్కువ నష్టం జరుగుతుంది? AC లేదా కూలర్‌లో నిద్రపోవడం వల్ల శరీరానికి ఎక్కువ హాని కలుగుతుందో తప్పక తెలుసుకోవాలి.

ఎండాకాలంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఏసీలో (AC) నిద్రపోవడం మంచిదా? లేక ఎయిర్ కూలర్‌లో (Cooler) నిద్రపోవడమే మంచిదా? అని సందేహ పడుతుంటారు. కానీ, రెండింటికీ తమ తమ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు రావచ్చు.

కూలర్ కంటే ఏసీలో నిద్రపోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. నిజానికి, ఎయిర్ కండిషనర్ చల్లని గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం కళ్ళలో పొడిబారవచ్చు. తేమ తగ్గడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలగవచ్చు. కూలర్లో తేమ స్థాయి తక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మం , కళ్ళపై తక్కువ ప్రభావం పడుతుంది.

ఏసీ గది ఉష్ణోగ్రతను త్వరగా తగ్గిస్తుంది. కానీ, ఎక్కువ సేపు చల్లని గాలిలో నిద్రపోతే, చర్మం పొడిబారడం, గొంతు ఎండిపోవడం, ముక్కు బ్లాక్ అవడం, కండరాల నొప్పులు, కొందరికి సైనసైటిస్ సమస్యలు వస్తాయి. అలాగే గది పూర్తిగా మూసివేసి ఉంటే తాజా గాలి రాకపోవడం వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఉష్ణోగ్రతను 24–26°C మధ్య ఉంచడం మంచిది.

ఎయిర్ కూలర్ నీటిని ఆవిరి చేసి గాలిని చల్లబరుస్తుంది. ఇది సహజ చల్లదనాన్ని ఇస్తుంది. అయితే గదిలో తేమ (Humidity) పెరుగుతుంది. అలెర్జీ ఉన్నవారికి ఇబ్బందులు కలిగిస్తుంది. ఆస్తమా రోగులకు సమస్యలు. సరిగ్గా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా పెరుగుదల, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూలర్ వల్ల చెమట, అసౌకర్యం కలగవచ్చు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...