సైబర్ వలలో సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి.. రూ.10.91 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

Date:

సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డి భార్య విజయలక్ష్మి సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కి మోసపోయారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో కేటుగాళ్లు వల విసరగా.. రూ.10.91 లక్షలు పొగొట్టుకున్నారు. దీంతో ఆమె సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆమె బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగం కావటం గమనార్హం.

సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పద్దతుల్లో  బురిడీ కొట్టిస్తున్నారు. అయితే వీరి వలలో సామాన్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు, వర్గాలకు చెందిన వారు కూడా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం సైబర్ మోసానికి గురైన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఆమె నుంచి రూ.కోట్లు కొట్టేశారు. బంగారం సైతం తాకట్టు పెట్టి ఆమె పెట్టుబడులు పెట్టింది. తాజాగా.. సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి సైతం సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయారు

సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేరుతో వచ్చిన ఫేక్ పెట్టుబడుల వీడియో ప్రకటన చూసి ఆయన భార్య బీవీ విజయలక్ష్మి రూ.10.91 లక్షలు పోగొట్టుకున్నారు. ఆ వెంటనే సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయలక్ష్మి బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేయటం గమనార్హం. గతేడాది డిసెంబరులో సామాజిక మాధ్యమాల్లో నిర్మలా సీతారామన్‌ పేరుతో ఒక పెట్టుబడి ప్రకటన చూశారు. సెబీ ఆధ్వర్యంలో ట్రేడింగ్‌లో పెట్టుబడులకు అవకాశముందని నమ్మించారు. క్వాంటాపల్స్‌ సంస్థ ఇందుకు సేవలు అందిస్తోందని చెబుతూ ప్రకటన కింద ఉన్న లింక్‌ ఉంచారు. విజయలక్ష్మి లింక్ మీద క్లిక్‌ చేయగా.. ఆర్థిక సలహాదారు ఆదిత్య సుబ్రహ్మణ్యం పేరుతో వాట్సాప్‌లో విజయలక్ష్మికి ఒకరు పరిచయమయ్యారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...