
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు విజయాలు సాధిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు మొత్తం 32 వార్డుల్లోనూ విజయం సాధించారు. అన్ని స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. దీంతో కుప్పం మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క వార్డు కూడా దక్కలేదు.
టీడీపీ సాధించిన ఈ విజయంతో పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పలుచోట్ల టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తం 32 వార్డులను టీడీపీ కైవసం చేసుకోవడంతో కుప్పం మున్సిపాలిటీలో ఆ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
