TDP కార్యకర్త దారుణ హత్య.. పోలీసుల వైఫల్యమంటూ టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Date:

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యకర్త దుర్గారెడ్డి హత్య కలకలం రేపింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదంతో హత్య జరిగింది. అయితే దుర్గారెడ్డికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆరోపించారు. అయితే జిల్లా ఎస్పీ కిషోర్ మాత్రం పోలీసులు వైఫల్యం లేదంటున్నారు.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన కారుమూరి దుర్గారెడ్డి హత్య కలకలం రేపింది. దుర్గారెడ్డికి రక్షణ కల్పించాలని తన కార్యాలయం నుంచి ఫోన్ చేసి చెప్పినా ఎస్సై పట్టించుకోలేదని టీడీపీ ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ వ్యాఖ్యలు చేయడం హాట్‌టాపిక్ అయ్యింది. దుర్గారెడ్డి హత్య గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే రోషన్ ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. దుర్గా రెడ్డి హత్యకు లా అండ్‌ ఆర్డర్‌ వైఫల్యమే కారణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం ఎస్సైకు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి తన పీఏ ఫోన్‌ చేశారని.. దుర్గా రెడ్డి సమస్య గురించి చెప్పామని.. ఈలోపే హత్య జరగడం దారుణమన్నారు. దుర్గారెడ్డిని హత్య చేసిన నిందితుల్ని 24 గంటల్లో పట్టుకోవాలని సూచించారు.

ఇదిలా ఉంటే దుర్గారెడ్డి హత్య కేసులో పోలీసులు వైఫల్యం లేదని ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్ తెలిపారు. దుర్గారెడ్డికి తన సోదరుడు వెంకటరెడ్డితో ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దుర్గారెడ్డి, వెంకటరెడ్డి కుటుంబాలకు చెందిన నలుగుర్ని బైండోవర్ కేసులు నమోదు చేయడానికి జంగారెడ్డిగూడెం పోలీసులు సమాచారం ఇచ్చారన్నారు. ఈ నలుగురిలో ముగ్గురు పోలీస్ స్టేషన్‌కు వస్తే తహసీల్దార్ దగ్గర బైండోవర్ చేయించామన్నారు. దుర్గారెడ్డి బైండోవర్‌కు రాలేదని.. పోలీసులు పొగాకు రైతుల ధర్నా కార్యక్రమం దగ్గర బందోబస్తులో ఉన్నట్లు తెలిపారు. దుర్గారెడ్డి వివాదాస్పద భూమి దగ్గరకు వెళ్లగా జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య జరిగిందన్నారు. దుర్గారెడ్డి హత్యకేసులో నిందితుల్ని అరెస్ట్ చేశామని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...