Bank Rules: ఈఎంఐ కట్టకపోతే బ్యాంకులు మీ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చా..? 90 రోజుల డెడ్ లైన్.. ఆ తర్వాత ఛాన్స్..

Date:

చాలమంది అవసరాల కోసం పర్సనల్ లోన్, హోం లోన్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు రుణం చెల్లించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో బ్యాంకులు మీ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చా.. బ్యాంకులకు హక్కు ఉంటుందా.. ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి..?

ఆర్ధిక అవసరాల కోసం లేదా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నగదు అవసరమైనప్పుడు చాలామంది బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారినప్పుడు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమవుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో బ్యాంకులు చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఉంటాయి. నోటీసులు పంపించడం, ఆస్తులు జప్తు చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. చాలామంది ఈఎంఐ రూపంలో ప్రతీనెలా రుణం చెల్లిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈఎంఐ చెల్లించడంలో ఆలస్యం కావొచ్చు. అయితే EMIని సకాలంలో చెల్లించపోతే బ్యాంకు మీ మొబైల్ సిమ్‌ను బ్లాక్ చేయవచ్చా..? ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

బ్యాంకులకు హక్కు ఉంటుందా..?

ఒక వ్యక్తి ఈఎంఐ చెల్లించడంలో విఫలమైతే.. బకాయి ఉన్న మొత్తాన్ని వసూలు చేయడానికి బ్యాంకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ మొబైల్ నంబర్‌ను ఇనాక్టివ్ చేసే హక్కు ఉండదు. ఖాతాదారుడి మొబైల్ నంబర్ లేదా సిమ్ కార్డును బ్లాక్ చేసే హక్కు బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం లేదు. కానీ మీరు ఈఎంఐ సకాలంలో చెల్లించకపోవడం వల్ల అనేక తీవ్ర పరిణామాలు ఉంటాయి. మొదటగా మీ క్రెడిట్ స్కోరు దెబ్బతినవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మీరు ఏ బ్యాంకు నుండి హౌస్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డులు వంటివి పొందలేరు. వీటితో పాటు బ్యాంకు జరిమానాలు, ఆలస్య రుసుములు, అదనపు వడ్డీ లాంటివి కట్టాల్సి ఉంటుంది. దీని ఫలితంగా మీరు చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. ఒకవేళ EMIలు చాలా నెలల పాటు చెల్లించకుండా ఉంటే బ్యాంకు నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు ప్రారంభించవచ్చు. మీరు ఇల్లు, వాహనం లేదా ఇతర ఆస్తి వంటి హామీపై రుణం తీసుకున్నట్లయితే.. బ్యాంకు ఆ ఆస్తి విషయంలో కూడా చర్యలు తీసుకోవచ్చు.

ఫోన్ సేవలను నిలిపివేయవచ్చా..?

చాలామంది ఈ-కామర్స్ లేదా బయట షాపుల్లో ఈఎంఐ రూపంలో కొత్త మొబైల్ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్‌ను ఈఎంఐ రూపంలో కొనుగోలు చేస్తే.. ఫోన్‌ను బ్లాక్ చేసే చేసే అవకాశం ఉంటుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకు తక్షణ చర్యలు తీసుకోలేదు. కనీసం 90 రోజుల పాటు ఈఎంఐలు చెల్లించకుండా ఉంటే ఈ పని చేయవచ్చు. తగిన ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే కొన్ని ఫోన్ ఫీచర్లపై ఆంక్షలు విధించవచ్చు. అయితే కాల్స్, ఇంటర్నెట్ యాక్సెస్, ఇతర అత్యవసర (SOS) ఫంక్షన్ల వంటి అవసరమైన సేవలను పూర్తిగా నిలిపివేయలేరు. దీంతో ఏ కారణం చేతనైనా మీ EMI చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొతే.. ఆ సమస్యను దాచిపెట్టకుండా వెంటనే బ్యాంకును సంప్రదించడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైనప్పుడు చాలా బ్యాంకులు రుణ పునర్‌వ్యవస్థీకరణ, EMI సర్దుబాట్లు లేదా తిరిగి చెల్లించడానికి అదనపు సమయం వంటి సౌకర్యాలను కూడా అందిస్తాయి. సకాలంలో సంభాషించడం వల్ల పరిస్థితి మరింత దిగజారకుండా నివారించవచ్చు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...