చెస్టర్ లీ స్ట్రీట్‌లో మారని టీమిండియా బ్యాడ్ లక్.. మూడోసారి కూడా వర్షార్పణమే..!

Date:

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. అభిషేక్ శర్మ (59), శ్రేయస్ అయ్యర్ (68) హాఫ్ సెంచరీలతో 189 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే భారత్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వర్షం తీవ్రం కావడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కు వీలుపడలేదు. అంపైర్లు డీఎల్ఎస్ పద్ధతిలో ఓవర్లను కుదించినా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణం అయింది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే భారత బ్యాటింగ్ ముగిసిన తర్వాత వర్షం కురిసింది. ఎంతకీ తగ్గక పోవడంతో మ్యాచ్ రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు.

నిజానికి ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. కానీ ఆటకు అంతరాయం కలిగేంత కాదు. ఆ చిరు జల్లుల మధ్య భారత బ్యాటింగ్ కొనసాగించారు. కానీ ఇన్నింగ్స్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వర్షం ఎక్కువ కావడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు. వర్షం తగ్గితే మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు ప్రయత్నించారు. అందుకోసం ఇంగ్లాండ్ లక్ష్యాన్ని సవరించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...