Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు

Date:

Telangana Sir Survey: ఎన్నికల సంఘం కల్పించిన ఈ అదనపు సమయాన్ని అర్హులైన ప్రతి ఒక్క పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కోరారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అందించని వారు వెంటనే స్థానిక BLOలను సంప్రదించి తమ వివరాలను..

Telangana Sir Survey: తెలంగాణ ప్రజలకు శుభవార్త. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Telangana Sir Survey) ప్రక్రియ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఓటర్ల వివరాల నమోదు, సవరణల్లో ఏ ఒక్కరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేందుకు చివరి తేదీని ఆగస్టు 10 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉండగా, వాస్తవానికి ఈ గడువు మొదట జూలై 24తో ముగియాల్సి ఉండగా, దానిని ఆగస్టు 3 వరకు విస్తరించారు. తాజాగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 10వ తేదీ వరకు మరోసారి పొడిగించారు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 77.12 శాతం ఎన్యూమరేషన్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్‌లో 56.31 శాతం, రంగారెడ్డిలో 63.43 శాతం, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం మాత్రమే నమోదు అయ్యాయి. ఇప్పుడు గడువు పొడిగించడంతో ఇప్పటి వరకు నమోదు చేసుకోలేని వారికి ఎంతగానో ఉపయోగపడనుంది.

ఎన్నికల సంఘం కల్పించిన ఈ అదనపు సమయాన్ని అర్హులైన ప్రతి ఒక్క పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కోరారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అందించని వారు వెంటనే స్థానిక BLOలను సంప్రదించి తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...