తెలంగాణ: ఆదివారం స్నేహితులతో కలిసి పిక్‌నిక్‌కి వెళ్లాడు.. కాసేపటికే విగతజీవిగా

Date:

ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి ఈ యువకుడు పిక్‌ నిక్‌కు వెళ్లాడు. దగ్గరలోని వాగుకు వెళ్లారు. ఇక అందరూ కలిసి అందులో ఈతకు దిగారు. అయితే ఈ యువకుడు కాసేపటికే విగతజీవిగా తిరిగొచ్చాడు. ఆపై ఏం జరిగింది.? ఈ వార్తలో చూసేద్దాం మరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఒకే రోజు గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు.

ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోయిన సంఘటన తీవ్ర విషాదం నింపింది. స్నేహితులతో కలిసి పిక్‌నిక్‌కి వెళ్లి వాగులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయి గుమ్మళ్ళ యశ్వంత్(15) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. మనవడిపై గారాబం పెంచుకున్న నాయనమ్మ మనవడి మృతదేహం చూసి రోదిస్తూ గుండెపోటుతో చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది.

అశ్వారావుపేటకు చెందిన ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు ఆంధ్రా సరిహద్దుల్లోని సంగమం వాగు వద్దకు వెళ్లారు. వాగు వద్ద ఆటలు ఆడుతూ అందరూ వాగులోకి స్నానానికి దిగగా.. ఇద్దరు బాలురు మునిగిపోయారు. వాగు లోతు అంచనా వేయకుండా వీరు దిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండటంతో క్షణాల్లో ఇద్దరూ మునిగిపోయారు.

ఒక బాలుడు సురక్షితంగా బయటపడగా. గుమ్మళ్ళ యశ్వంత్ అనే బాలుడు గల్లంతయ్యాడు. స్థానికులు వచ్చి వాగులో గాలించగా యశ్వంత్ మృతదేహం లభించింది. మృతి చెందిన యశ్వంత్ అశ్వారావుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో పదవతరగతి చదువుతుండగా, ఆదివారం పిక్‌నిక్ అని వెళ్ళిన తమ కుమారుడు జీవచ్చవంగా ఇంటికి చేరడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఎంతో గాారాబంగా చూసుకున్న తన మనవడి మృతదేహాన్ని చూసి రోదిస్తూ నాయనమ్మ ఎంకులమ్మ(65) ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...