టెంపుల్ సిటీ తిరుపతిలో మరో వివాదం.. వన్ ప్రాజెక్టుకు భూ కేటాయింపులపై రాజకీయ రచ్చ!

Date:

టెంపుల్ సిటీ తిరుపతిలో ఇప్పుడు మరో వివాదంపై రచ్చ నడుస్తోంది. తిరుపతి వన్ ప్రాజెక్టుకు కేటాయించిన 22 ఎకరాల ప్రభుత్వ భూముల వివాదంపై సర్కార్‌తో వైసీపీ ఢీ అంటే ఢీ అంటోంది. విలువైన భూములను అనుభవం లేని సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టారని, దీని వెనుక వందల కోట్ల అవినీతి దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తుంటే, ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని టీడీపీ అంతే బలంగా తిప్పికొడుతోంది. ఈ అంశంపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని అధికార పార్టీ సవాల్ విసురుతోంది.

తిరుపతిలోని దామినేడు దగ్గర ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు కోసం కేటాయించిన 21.10 ఎకరాల భూములపై అధికార కూటమి, వైసీపీ మధ్య రాజకీయ యుద్ధం మొదలైంది. ప్రభుత్వం తన పర్యాటక విధానం 2024-29లో భాగంగా రూ. 1,226 కోట్ల పెట్టుబడి, 1,500 మందికి ఉపాధి లక్ష్యంతో దివ్యశ్రీ హోల్డింగ్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ఈ భూమిని కేటాయించింది.

ఇందులో ఫైవ్ స్టార్ హోటల్స్, థీమ్ పార్కులు, 5,000 మంది సామర్థ్యంతో కూడిన MICE కాంప్లెక్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే, సబ్-రిజిస్ట్రార్ విలువ ప్రకారం రూ. 1,000 కోట్లు ఉన్న భూమిని కేవలం రూ. 90 కోట్లకు ధారాదత్తం చేశారని, దీని వెనుక రూ. 400 కోట్ల మేర అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ డీల్ వెనుక మంత్రి నారా లోకేష్ హస్తం ఉందని, 15 ఏళ్ల జీఎస్టీ మినహాయింపు వంటి రాయితీల ద్వారా ఆ సంస్థలకు రూ. 1,400 కోట్ల లబ్ధి చేకూరుస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

తిరుపతి వన్ ప్రాజెక్టుకు భూముల కేటాయింపుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను కూటమి సర్కార్ తప్పుపడుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడేవన్నీ అబద్ధాలేనని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు. రూ. 1000 కోట్ల విలువైన స్థలాన్ని రూ. 94 కోట్లకే ఇచ్చారనడం పచ్చి అబద్ధమని, ప్రభుత్వ ధర ప్రకారమే పారదర్శకంగా భూకేటాయింపులు జరిగాయని స్పష్టం చేశారు. భూముల కేటాయింపులో ఎలాంటి అవినీతి జరగలేదని, దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని భూమనకు సవాల్ విసిరారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్.. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్...

ఆరుగురిని చంపిన హంత‌కుడికి అనాథ‌లా అంత్య‌క్రియ‌లు.. కుటుంబ సభ్యులు వద్దనడంతో.. ఎవరు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక...

సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు.. ఏడాది జైలుశిక్ష పడే అవకాశం ఉందా?

రాష్ట్రంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా.....