
D Spiritual: Nov 20: తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద ఘనంగా ఆయుధపూజ.. విద్యుత్ పరికరాలకు ప్రత్యేక పూజలు!
తిరుమలలోని గోగర్భం డ్యామ్ వద్ద టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఆయుధపూజ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ విభాగానికి చెందిన సబ్‌స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు అధికారులు, సిబ్బంది సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఎలక్ట్రికల్ ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీ చంద్రశేఖర్, హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీ చంద్రశేఖర్, టీటీడీ ఈఈలు శ్రీ శ్రీనివాసరావు, శ్రీ ప్రసాద్‌తో పాటు పలువురు విద్యుత్ ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి జారీ చేసిన సమాచారం.
