
జాబితాలో హరిదీప్ సింగ్ పురి, స్మృతి ఇరానీకి చోటు లేదు
లక్నో: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎనిమిది మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురి, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.
యూపీ నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్థులుగా ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాశ్ పాల్, ఎమ్మెల్సీ విద్యాసాగర్ సోంకర్, గోపీ కృష్ణ పాండే, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, మాజీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్, శ్రుతి గంగావర్‌లను ఎంపిక చేసింది.
ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇందులో ఏడు స్థానాలను బీజేపీ సులభంగా గెలుచుకునే అవకాశం ఉండగా, ఎనిమిదో స్థానానికి పోటీ నెలకొనే పరిస్థితి ఉంది. రాజ్యసభ ఎన్నికలు అక్టోబర్ 16న జరగనున్నాయి.
