Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

Date:

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు చెన్నై సెంట్రల్‌ నుంచి విజయవాడకే పరిమితమైన ఈ సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ భీమవరం, గుడివాడ మీదుగా నర్సాపూర్‌ వరకు విస్తరించారు. దీంతో ఏసీ ప్రయాణం కోసం ఎదురుచూసే ప్రయణికులకు ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది.

నర్సాపూర్‌ – చెన్నయ్‌ మధ్య 655 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 9 గంటల్లోనే పూర్తి చేస్తుంది. ఈ రైలు మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుందని అధికారులు తెలిపారు.. ఇవాళ చెన్నై సెంట్రల్‌ – నర్సా పూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ను లాంఛనంగా ప్రారంభించనుండగా.. డిసెంబర్ 17వ తేదీ నుంచి ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

నరసాపూర్-చెన్నై మార్గంలో పరుగులు తీయనున్న ఈ మొదటి వందే భారత్ తో నరసాపూర్-చెన్నై సెక్టార్‌లో వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి.. 655 కి.మీ దూరాన్ని 8 గంటల 55 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.

ప్రయాణ సమయంలో ఈ వెసులుబాటుతో రోజువారీ ప్రయాణికులు, వ్యాపార ప్రయాణికులు, పర్యాటకులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ నరసాపూర్-చెన్నై వందేభారత్ రైలు రేణిగుంట జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్ – భీమవరం టౌన్ వద్ద ఆగుతుంది.

రైలు షెడ్యూల్..
షెడ్యూల్ ప్రకారం, చెన్నైకి వెళ్లే సర్వీస్ మధ్యాహ్నం 2:50 గంటలకు నరసాపూర్ నుండి బయలుదేరి రాత్రి 11:45 గంటలకు డాక్టర్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. చెన్నై నుండి బయలుదేరే రైలు ఉదయం 5:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:10 గంటలకు నరసాపూర్ చేరుకుంటుంది.

టికెట్ ధర..
టిక్కెట్ ధరలు AC చైర్ కార్ కు రూ.1,635 మరియు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కు రూ.3,030 నిర్ణయించారు. ప్రయాణీకులకు వేగవంతమైన ప్రయాణాలు, ఆధునిక సౌకర్యాలతో ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...